Saturday, September 11, 2010

మల్లమ్మ కథ--1973

సంగీతం::S.P. కోదండపాణి
రచన::వేటూరి 
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద, రామకృష్ణ,విజయలలిత,గుమ్మడి,పద్మనాభం

పల్లవి::

అంతా..ఆ ఆ ఆ ఆ..శివమయమేకాదా..ఆఆఆఆ  
శ్రీ శివలీలలు వినరాదా..ఆ..ఆ శివజ్యోతిని కనరాదా..ఆ
సాంబసదాశివ సాంబసదాశివ..సాంబసదాశివ సాంబశివ
సాంబసదాశివ సాంబసదాశివ..సాంబసదాశివ సాంబశివ 

చరణం::1

సుధనే..ఏ..కోరీ దేవాసురులే..కడలిని మధియించువేళ
హాలాహలమే ప్రభవించగా..హాలాహలమే ప్రభవించగా 
అభయమొసంగీ గరళము మింగీ..లోకాలగాచినా లోకేశా
లోకాలగాచినా లోకేశా  
    
అంతా..ఆ ఆ ఆ ఆ..శివమయమేకాదా
శ్రీ శివలీలలు వినరాదా..ఆ శివజ్యోతిని కనరాదా

చరణం::2

పృధివి రధముగా విధి సారధిగా..వేదాలే హయములుగా 
రవి చంద్రులే రధచక్రాలుగ..రవి చంద్రులే రధచక్రాలుగ
త్రిపురాసురులనే నాశము చేసి..జగముల బ్రోచినా జగధీశా
జగముల బ్రోచినా జగధీశా  

సాంబసదాశివ సాంబసదాశివ..సాంబసదాశివ సాంబశివ
సాంబసదాశివ సాంబసదాశివ..సాంబసదాశివ సాంబశివ               

దక్షునియాగము..ద్వంసము చేసిన దైవత శేఖరా
పసుపతాస్త్రము..పార్థునకొసగిన భక్తవశంకరా
తాండవకేళీ కళాదురంధర..గౌరీ మనోహరా
హరా..ఆ..స్మరహరా..ఆ..శుభకరా..ఆ..శంకరా
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ 
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ 
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ

No comments: