Monday, August 08, 2011

సుందరి-సుబ్బారావ్--1984




























సంగీతం::సత్యం
దర్శకత్వం::రేలంగి నరసింహారావు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::చంద్రమోహన్,విజయసాంతి.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పాడనా వేణువై..నీవు నా ప్రాణమై
పాడనా వేణువై..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావని లో
ప్రియ దర్శన రస మాధురిలో..ఓ

పాడనా వేణువై నీవు నా ప్రాణమై

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చెలీ..సఖీ..ప్రియే..చారుశీలే..అనీ..ఈ
తలచి తనువు మరచి కలలు కన్నానులే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
కాముడిలా సుమ బాణాలు వేసి..ఆ
కదిలిన నీ చలి కోణాలు చూసి..ఆ
ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో
సంగీతమే పాడిందిలే..ఏ

పాడనా వేణువై..నీవు నా ప్రాణమై

చరణం::2

ఆ ఆ ఆ హా ఆ ఆ హా ఆ ఆ హా ఆ
కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
నీలో అలిగే అందాల రూపం..ఆ
నాలో వెలిగే శృంగార దీపం..ఆ
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం..ఆ
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే..ఏ..పాడిందిలే

పాడనా వేణువై..ఆ..నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో..ఓ
ప్రియ దర్శన రస మాధురిలో..ఓ

పాడనా వేణువై..ఆ..నీవు నా ప్రాణమై

No comments: