Saturday, September 21, 2013

నాటకాల రాయుడు--1969::కాఫీ::రాగం





















సంగీతం::G.K. వేంకటేష్ 
రచన::ఆత్రేయ
దర్శకత్వం::A.సంజీవి
నిర్మాణం::దిడ్డి శ్రీహరిరావు
నిర్మాణ సంస్థ::హరిహర ఫిల్మ్స్ 
గానం::P.సుశీల 

కాఫీ:::రాగం::

తారాగణం::నాగభూషణం,కాంచన,కైకాల సత్యనారాయణ,
చిత్తూరు నాగయ్య,బి.పద్మనాభం,ప్రభాకరరెడ్డి

పల్లవి::

నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే
నెలవంక చలువల్లు వెదజల్లగా
నిదుర రావమ్మా రావేనెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే

చరణం::1

ఓ ఓ ఓ..చిరుగాలి బాల పాడింది జోల పాడిందీ జోల
చిగురాకు మనసు కనుపాపలందు
ఎదదోచెనమ్మా ఏవెవో కలలు
కలలన్నీ కళలెన్నో విరబూయగా
నిదుర రావమ్మా రావే..నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే

చరణం::2

ఓ ఓ ఓ..నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగిందీ లాలీ
గగనాన్ని చూసి ఒక కన్నుదోయి వినిపించమంది ఎన్నెన్నో కథలు
కథ చెప్పి మురిపించి మరపించగా
నిదుర రావమ్మా రావే..నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే..నిండారా రావే


No comments: