Monday, November 26, 2012

వెలుగు నీడలు--1961





సంగీతం::పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన::శ్రీ శ్రీ
గానం:: P.సుశీల , స్వర్ణలత

పల్లవి::

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట

చరణం::1

కళ్ళకి పట్టీ చల్లగా కట్టి వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూద్దాం
చురుకుతనం బుద్దిబలం ఉంటేనే చాలు
చూడకనే తెలియు కదా నిజానిజాలు

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

చరణం::2

కన్నులుంది చూడలేరు కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం
కన్నులుంది చూడలేరు కొంతమంది జనం
దారి తప్పి తిరగడమే తెలివిలేనితనం

మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి
మెదడు పదును పెట్టాలి అసలు దొంగను పట్టాలి
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

చరణం::3

అంబా అనే అరుపు విని తల్లిని చేరు లేగ
నేల మెడ పిట్టను పోల్చు నింగినెగురు డేగ
చీకటైన చిటారుకొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి

వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
వేడుకగా ఈ పూట ఆడుదమా దొంగాట
చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు 
చేరి మనం ఆడేపాడే పండుగరోజు

No comments: