Tuesday, April 24, 2012

ఎర్ర గులాబిలు--1979




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

రూ రూరురు రూరురు రూరూ..
ఎర్రగులాబి విరిసినది..తొలిసారి ననుకోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..

ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి

చరణం::

లతనై నే జతనై నిన్నే పెనవేయనా..
కతనై నీ కలనై నిన్నే మురిపించనా??

నేనిక నీకే సొంతము..
నననననన నీకెందుకు ఈ అనుబందమూ..
ననన ననన ననన ననన నననా..

ఎర్రగులాబి విరిసినది..తొలిసారి ననుకోరి
ఆశే రేపింది నీలో..
అందం తొణికింది నాలో..
స్వర్గం వెలిసింది భువిలో..
ఎర్రగులాబి విరిసినది..

చరణం::2

పెదవినీ, ఈ మధువునూ నేడే చవిచూడనా..
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా?

వయసును వయసే దోచేది..
నననననన అది మనసుంట్నే దొరికేది..
ననన ననన ననన ననన నననా..

ఎర్రగులాబి విరిసినది..తొలిసారి నినుకోరి
ఆశే రేపింది నాలో..
అందం తొణికింది నీలో..
స్వర్గం వెలిసింది భువిలో..

ఎర్రగులాబి విరిసినది..నననన నననన అహహ..

No comments: