Monday, April 23, 2012

ఇల్లు-ఇల్లాలు--1972






















ఈ పాట ఇక్కడ వినండి

సంగీత::K.V.మహదేవన్
రచన::అప్పలాచార్య
గానం::S.జానకి,రాజబాబు
తారాగణం::కృష్ణ, కృష్ణంరాజు,రాజబాబు,రమాప్రభ,వాణిశ్రీ,సూర్యకాంతం

పల్లవి::

వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయమ్ము చెబుతాను
వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయమ్ము చెబుతాను
అసలు విషయమ్ము చెబుతాను

చెప్పుమలీ

కారు మబ్బులు కమ్మేవేళా కాకులు గూటికి చెరేవేళా
కా...కా
చందమామ తొంగిచూసెవేళా సన్నజాజులు పూసేవేళా
ఆహా..ఓహో
ఒంటిగ నేను యింట్లోవుంటే..ఉయ్యాల ఎక్కి ఊగుతువుంటే
లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలిలో

ఏం జలిగింది?

తలుపు కిర్రున చప్పుడైనదీ..గుండె ఝల్లునా కొట్టుకున్నదీ
తలుపు కిర్రున చప్పుడైనదీ..గుండె ఝల్లునా కొట్టుకున్నదీ
మెల్ల మెల్లగ కళ్ళుతెరచి నే వచ్చినదెవరో చూసాను..వచ్చినదెవరో చూసాను

ఎవలాలు

నల్లనివాడు గుంటకన్నులవాడు గుబురు మీసాలవాడూ
అయ్యబాబోయ్
ఆరడుగుల పొడుగువాడు..ముద్దులిమ్మని నన్ను అడిగినాడు
ఏయ్ వాణ్ణి నేన్నలికేత్తాను 
నెనివ్వనెనివ్వ రానివ్వనంటూ..మొఖము దాచుకున్నా
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ..జడను లాగినాడూ
అమ్మా..నాన్నా..అమ్మా..నాన్నా కాపాడమంటూ అల్లాడిపోయానూ
అయినా కాని వదలక నన్ను ఒడిసి..పట్టినాడు
అంతలో వచ్చింది
ఏమిటి మూల్చా
కాదూ మా అమ్మ
ఊ..ఏమందీ
వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా ముద్దులిస్తే నీకు 
డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు..డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు 
అని ముందుకు తోసింది

ఆ..అది తల్లా కాదు లాక్షసి పిచాచి దయ్యం..తల్వాతేమయిందో చెప్పు

తప్పనిసరియై వెళ్లాను..సిగ్గుపడుతు నిలుచున్నాను
ఆ.....!!!
గదిలో కెత్తుకుపోయాడు కథలూ కబుర్లు చెప్పాడు..తన దుప్పటిలో చోటిచ్చాడు 
ఛీ కులతా..పాపాత్ములాలా..నువ్వు నాకొద్దు పో..వాడిదగ్గలకే పో

అంతకోపం ఎందుకయ్యా..అపుడు నా వయసైదయ్యా
ఏమితీ అప్పుడు నీకైదేళ్లా
అంతకోపం ఎందుకయ్యా..అపుడు నా వయసైదయ్యా
ఆ వచ్చినదీ..మా తాతయ్యా
తాతయ్యా తాతయ్యా మలి చెప్పవే 
తాతయ్య తకదియ్య
తాతయ్యా నేను ఎవలో..అనుకున్నాను
తాతయ్య కొంప..ముంచేచాడు

No comments: