Tuesday, September 20, 2011

సుమంగళి--1965::రాగేశ్రీ::రాగం

ఈ పాట ఇక్కడ వినండి




రాగేశ్రీ::రాగం
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా

అంధుని ఎదుట అందాలేలా..
అడవికి పున్నమి వెన్నెలలేలా..
అసమర్థునికి అవకాశాలేలా..
వృధా వృధా..ఈ బ్రతుకు వృధా..

No comments: