Tuesday, August 10, 2010

మానవుడు దానవుదు --1972





సంగీతం::అశ్వద్ధామ
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీ


పచ్చని మన కాపురం
పాలవెలుగై..మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ...కళకళలాడాలీ..ఈ...
పచ్చని మన కాపురం...

నీగుండెల సవ్వడిలోన..నాగుండెల గుసగుసలుంటే
నీకంటిపాపలలోనా..నాకలల రూపాలుంటే..
మన బ్రతుకే అనురాగానికి..ప్రతిరూపమౌనులే
మన బ్రతుకే అనురాగానికి....
ప్రతిరూపమౌనులే..ప్రతిరూపమౌనులే...
పచ్చని మన కాపురం...
పాలవెలుగై..మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ...కళకళలాడాలీ..ఈ...
పచ్చని మన కాపురం...

నీవులేనిక్షణమైనా..నా కనులకు ఒకయుగమై
మన ఇరువురి కలయికలో..ఇరుమేనులు చెరిసగమై
ప్రాణంలో..ప్రాణంగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
పరవశించిపోవాలి..పరవశించిపోవాలీ....
పచ్చని మన కాపురం..
పాలవెలుగై..మణిదీపాలవెలుగై...
కలకాలం నిలవాలీ...కళకళలాడాలీ..ఈ...
పచ్చని మన కాపురం..
.

No comments: