Thursday, December 13, 2007

వయసు పిలిచింది ~1978





Listen Here!
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి సుందరరమమూర్తి
గానం:S.P..బాలు

Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల

రాగం:

హే ముత్యమల్లే మెరిసిపొయే మల్లెమొగ్గా
ఆరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే

చరణం::1


కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
గుబులౌతుందే గుండెల్లొనా
జరగనా కొంచం నే నడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందాము మనమూ
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ వుండిపోవే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే

చరణం::2


పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మల్లా
ఉరికె పరువమిది మనదీ
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపొవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపొవా

మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిసిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మంచి చోటే మనకు కుదిరిందిలే 

No comments: