Monday, November 05, 2007

పాండవ వనవాసం--1965


సంగీతం::ఘంటసాలవేంకటేశ్వరరావు 
రచన::ఆరుద్ర
గానం::సుశీల,పద్మనాభం 
తారాగణం::N.T.రామారావు,S.V.రంగారావు,సావిత్రి,గుమ్మడి,హరనాధ్,
రాజనాల,కాంతారావు,L.విజయలక్ష్మి,సంధ్య.
::::::

బావా...
బావా...
బావా...
మాట్లాడవేమిబావా..
ఐతే నేవెళ్ళి పోతున్నాను
శశీ....బావా....శశి...
బావా....శశీ...పో బావా...
హా....హేయ్......

బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
బాజాలు మ్రోగందె
బాకాలు ఊదందె ఎందుకు కంగారు
అమ్మా...అబ్భా..ఇహీ....
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
బాజాలు మ్రోగందె
బాకాలు ఊదందె ఎందుకు కంగారు
ఆహా...అహా...
చిలిపి చేష్టలతో వలపే కోరునట
ముద్దు తీర్చమనీ సద్దుచేయునట
చిలిపి చేష్టలతో వలపే కోరునట
ముద్దు తీర్చమనీ సద్దుచేయునట
మరులుకొనే బాల తను మనసుపడెవేళా
మరులుకొనే బాల తను మనసుపడెవేళా
ఉలికిపడి వునికిచెడి
వుక్కిరిబ్బిక్కిరిఔతాడంట
ఓ...హోయ్...బావ..బావా...." మరదలా "
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
పరుగులుతీసే వురకలువేసే బావను ఆపేరు...


సుందరాంగుడట గ్రంధసాంగుడట
ఏడు మల్లియలా ఎత్తుతూగునట
సుందరాంగుడట గ్రంధసాంగుడట
ఏడు మల్లియలా ఎత్తుతూగునట
కలికి కొనాగోట ఆ చెంప ఇలా మీట
కలికి కొనాగోట ఆ చెంప ఇలా మీట
తబలవలే అదిరిపడి లబోదిబో అంటాడంట
ఓ....హొ...హొయ్..బావా బావా... " మరదలా "
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ
బావను తిప్పెను
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ
బావను తిప్పెను
" వద్దు... "
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు
" వద్దూ... "
వలపులలోన జలకములాడ
" వద్దూ... "
బావను తిప్పెను
వలపులలోన జలకములాడ
బావను తిప్పెను
ఏ....యి....

No comments: