సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Director::V. Madhusudhan Rao
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,B.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి
పల్లవి::
చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చరణం:: 1
ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే
మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తరచూపులు కనబడుతూంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వెచ్చగ ఉంటుందోయ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చరణం:: 2
కారుమబ్బులూ కమ్ముతూ ఉంటే..కమ్ముతూ ఉంట
కళ్ళకు ఎవరూ కనబడకుంటే..కనబడకుంటే
ఆ..కారుమబ్బులూ కమ్ముతూ ఉంటే..కమ్ముతూ ఉంట
కళ్ళకు ఎవరూ కనబడకుంటే..కనబడకుంటే
జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే
జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చరణం:: 3
చలిచలిగా గిలివేస్తుంటే..ఆ..ఆ..హా..
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓ..ఓ..హో....
చలిచలిగా గిలివేస్తుంటే..ఆ..ఆ..హా..
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓ..ఓ..హో....
చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగల
చలి మంటలుగా అనుకుంట
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ
చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ
No comments:
Post a Comment