Monday, June 04, 2007

నర్తనశాల--1963::కానడ::రాగం



సంగీతం::సుసర్ల దక్షణామూర్తి
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.సుశీల

Film Music Director::Kamalakara Kameswara Rao

తారాగణం::N.T.రామారావు,సావిత్రి,S.V.రంగారావు,మిక్కిలినేని,దండమూడిరాజగోపాలరావు,రేలంగి,ముక్కామల,శోభన్‌బాబు,L.విజయలక్ష్మి,సంధ్య,ధుళిపాళ,ప్రభాకర్‌రెడ్డి,అల్లురామలింగయ్య,కాంతారావు,C.లక్ష్మీరాజ్యం,కైకాలసత్యనారాయణ,వంగర,బాలకృష్ణ,సీతారాం.
కానడ::రాగం 

అమ్మా... అమ్మా...
జననీ శివకామిని
జయ సుభకారిని విజయ రూపిని
జననీ శివకామిని
జయ సుభకారిని విజయ రూపిని

!! జననీ శివకామిని !!

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ
శరనము కోరితి అమ్మ భవాని

!! జననీ శివకామిని !!

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ
జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని

!! జననీ శివకామిని !!

1 comment:

gsmanyam said...

ee paaTa anTae naaku chaalaa ishTam Sakti jee, chaalaa baavunTundi