సంగీతం::S.దక్షణామూర్తి
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును
ఆ..వలపులు చిలికె వగలాది చూపు
పిలువక పిలిచీ విరహాల రేపు
ఆ..ఎదలో మెదిలె చెలికాని రూపు
ఏవో తెలియని భావల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబారాలే
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే
ఆ..పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసీ మరపించు మనసు
ఆ..ప్రణయము చిందె సరసాల గ్రంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే..
ఆఅ..చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును
గడుసరి ఏమని వివరింతును...
No comments:
Post a Comment