సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల
సాకి::
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తొలకరి మెరుపులా..ఆఆ..తొలివాన చినుకులా
ఏ వేళ వచ్చావు ఎవరికోసం
ఇంకెవరి కోసం..మ్మ్..
ఏమేమి తెచ్చావు ఈ బావ కోసం
పల్లవి::
సన్నజాజి సొగసుంది జున్నులాంటి వయసుంది
నిన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంది
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ బతుకే ఇంక నీదిరా బావా
ఈ బతుకే ఇంక నీదిరా
సన్నజాజి సొగసుంటే జున్నులాంటి వయసుంటే
నన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంటే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ బతుకే ఎంతో ముద్దులే పిల్ల
ఆ బతుకే ఎంతో ముద్దులే
చరణం::1
బంగారు నగలేవి పెట్టుకోనురా
పట్టంచు చీరలేవి కట్టుకోనురా
గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే
గుండెలో మొలకెత్తే గోరువెచ్చని వలపే
పెదవుల భరిణలో పొదిగి ఉంచినానురా
ఇంతకు మించి ఏమి లేదురా బావా
ఈ వలపే ఇంక నీదిరా..ఆ..
మిసమిసలాడే నీ మేనే బంగారం
సిగ్గే కంచి పట్టు చీరకన్న సింగారం
నీ పెదవులు చిలికే తేనియ వలపే
పెదవులు చిలికే తేనియ వలపే
ముద్దుల మూటలో ముడిచి దాచుకుందునే
అంతకు మించి ఏమి వద్దులే పిల్లా
ఆ వలపే ఎంతో ముద్దులే
చరణం::2
రవ్వల మేడలంటే మనసు లేదురా
పువ్వుల పానుపంటే మోజు లేదురా.
పచ్చని చేలలో పైరగాలి జోలలో
పచ్చని చేలలో పైరగాలి జోలలో
ముచ్చటైన గూడు కట్టి వెచ్చగా ఉందాము రా
ఇంతకు మించి ఏమి వద్దులే బావా
ఈ వరమొక్కటే చాలులే
రవ్వలు ఎందుకు నీ నవ్వులు ఉండగా
పూవులు ఎందుకు నీ పులకింతలుండగా
ఆ ఆ ఆ..వీడని బాసలే వాడని తీవెలుగా
వీడని బాసలే వాడని తీవెలుగా
వెన్నెల గూడు కట్టి వేయి జన్మలుందాము
అంతకు మించి ఏమి వద్దులే
ఆ ఆ చల్లని కాపురమే చాలులే
ఆ ఆ చల్లని కాపురమే చాలులే
No comments:
Post a Comment