Tuesday, April 10, 2012

చెల్లెలి కాపురం--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దాశరధి 
గానం::Pసుశీల,B.వసంత 

పల్లవి::

రాణీ..రమణీ..మల్లీ..వల్లీ
రాజీ..రోజా..సరోజా 
ష్..నా చిట్టి..నా చిన్నీ
నా చిట్టి..నా చిన్నీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ
నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

చరణం::1

ఎన్నడు లేనీ ఈ పులకింతా
ఎందుకోసమే నీ వళ్ళంతా 
ఎన్నడు లేనీ ఈ పులకింతా
ఎందుకోసమే నీ వళ్ళంతా 
ఎందుకే ఎందుకే ఎందుకే 
మల్లెల గాలీ చల్లగ వీచి
ఝల్లని పించెను ఒళ్ళంతా  
మల్లెల గాలీ చల్లగ వీచి
ఝల్లని పించెను ఒళ్ళంతా  
అందుకే అందుకే అందుకే..ఆ..ఉం  
బేబీ..రూబీ..సీతా..గీతా
షీలా..మాలా..సుశీలా  
ష్..నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

చరణం::2

నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా
మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా
మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
ఎందుకే ఎందుకే ఎందుకే 
చెలి చేతులలో చిక్కిన వేళా
సిగ్గే మొగ్గై విరిసెనులే
చెలి చేతులలో చిక్కిన వేళా
సిగ్గే మొగ్గై విరిసెనులే
అందుకే అందుకే అందుకే
అంతేనా...హా
రాజు..రామూ..వేణూ..శీనూ
సోమూ..గోపీ..బాలయ్యా 
ష్..నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

Saturday, April 07, 2012

యుగపురుషుడు--1978




















సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::వేటూరి 
గానం::P.సుశీల, S.P. బాలు
తారాగణం::N.T. రామారావు,జయప్రద,రావు గోపాలరావు,రాజబాబు,
అల్లు రామలింగయ్య,జయలక్ష్మి

ఆమె::-ఒక్క రాత్రి వచ్చిపోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట చెప్పి పోరా
ఏడు జన్మలు వేచి ఉంటా 

అతడు::-ఒక్క రాత్రి వచ్చిపోవే
వేయి పాన్పుల హాయినిస్తా 
ఒక్క మాట ఇచ్చిపోవే
ఎన్ని జన్మలైనా కలిసిఉంటా

చరణం::1 

అతడు::-మెత్త మెత్తగా..యెదనె మత్తుగా
హత్తుకుపోతా..హాయి అంచు చూస్తా 
మెత్త మెత్తగా..యెదనె మత్తుగా
హత్తుకుపోతా..హాయి అంచు చూస్తా 

ఆమె::-కన్నె మోజులే..నిన్నల్లుకోనీ..ఈ 
కన్నె మోజులే..నిన్నల్లుకోనీ..ఈ 
కౌగిలింతలే నా ఇల్లు కానీ
ఒక్క రాత్రి వచ్చిపోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా

చరణం::2 

ఆమె::-ఆవిరావిరవుతున్నది నా అందమూ
ఆవురావంటున్నది నీ కోసమూ

ఆవిరావిరవుతున్నది నా అందమూ
ఆవురావంటున్నదె నీ కోసమూ

అతడు::-నీ సోగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి
నీ సోగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి

పెదవెంగిలితో తీరును 
ప్రేమ అనే ఆకలి

అతడు::-ఒక్కరాత్రి వచ్చిపోవే 
ఆమె::-ఒక్క రాత్రి వచ్చి పోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా

అతడు::-ఒక్క మాట ఇచ్చిపోవే 
ఎన్ని జన్మలైనా కలిసి ఉంటా

దొరలు దొంగలు--1976



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4788
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను
ఆడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట
ఆఅడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట 
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను  
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు 
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు
ఒక్కసారే తన్నిటి ముద్దు అంతకు మించి వద్దే వద్దు  
వద్దు అబ్బబ్బ వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు
   
చరణం::1
   
ఊరు పేరూ లేని కృష్ణుడు యుగపురుషుడు ఐనాడంటే..ఏఏఏఏ 
ఊరు పేరూ లేని క్కృష్ణుడు యుగపురుషుడు ఐనాడంటే
సత్యభామ తన్నులుగాక సత్యభామ తన్నులుగాక
వేరే కారణ మేముంది...అందుకే         
తన్నుఅయ్యయ్యో తన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను   

చరణం::2

కోకా రైకా లేని గోపికలు ఏటికి అందం తెచ్చారంటే..ఏఏఏఏఏ 
కోకా రైకా లేని గోపికలు ఏటికి అందం తెచ్చారంటే 
అది కృష్టుని చలవే అయినా అది కృష్టుని చలవే అయినా 
ఆపని మళ్ళీ చేశాడా అందుకే
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు 
ఒక్కసారే తన్నిటి ముద్దు అంతకు మించి వద్దే వద్దు 
ఆ..తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
ఆడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట  
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
ఆహా..వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు     
మ్మ్ హు..తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు  

Friday, April 06, 2012

ఆడదాని అదృష్టం--1975



















సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి,S.P.బాలు   
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే నీవే నీవే
నా తోడూ నీడవు నీవే నీవే నీవే నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే                        

చరణం::1

చీకటి ముసిరే వేళలో వికసించే ఉదయం నీవే 
చీకటి ముసిరే వేళలో వికసించే ఉదయం నీవే
కలతలలో కన్నీళ్ళలో కలతలలో కన్నీళ్ళలో 
కరుణించే హృదయం...నీవే  
నడిపించే దైవం నీవే..నడిపించే దైవం నీవే
నీవే నీవే నా తోడూ నీడవు నీవే నీవే నీవే
నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే    

చరణం::2

ఏ తొలి జన్మలలోనో ఏ పాపాలను చేశామో 
ఏ తొలి జన్మలలోనో ఏ పాపాలను చేశామో
ఆ పాపాలనూ మా లోపాలనూ 
ఆ పాపాలనూ మా లోపాలనూ 
మన్నించే దేవివి నీవే..ఏ 
కాపాడే తల్లివి నీవే కాపాడే తల్లివి నీవే 
నీవే నీవే నా తోడూ నీడవు 
నీవే నీవే నీవే నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే

Monday, April 02, 2012

చెల్లెలి కాపురం--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు

పల్లవి::

పిల్లగాలి ఊదిందీ పిల్లనగ్రోవీ
పల్లవించి ఊగిందీ గున్నమావీ
ఈఈఈఈఈఈ   
మా పల్లె మారింది వ్రేపల్లెగా
మనసేమొ పొంగింది పాలవెల్లిగా
ఆఆఆఆఆఆ   

చెలువ పంపిన పూలరేకులు
చిలిపి బాసల మూగలేఖలు
మరల మరలా చదువుకొందును
మనసునిండా పొదుగు కొందును
చిలిపి బాసల మూగలేఖలు
చెలువ పంపిన పూలరేకులు

పరిమళాలే పల్లవులుగా
ప్రణయ గీతము లల్లుకొందునూ
ప్రణయ గీతము లల్లుకొందునూ
బ్రతుకు పాటగా పాడుకొందునూ
చిలిపి బాసల మూగ లేఖలు
చెలువ పంపిన పూల రేకులు

ఎవరికోసము రాధ ఏతెంచెనో
ఎదురు పడగ లేక ఎటు పొంచె 
తిలకించి లోలోన పులకించెనో
చిలిపి కృష్ణుడు అంత చెంగు చేపట్టగా
నిలువెల్ల ఉలికిపడి తలవాల్చెనో

Saturday, March 31, 2012

జల్సా రాయుడు--1984




డైరెక్టర్::S.P.ముత్తురామన్
సంగీతం::ఇళయరాజ
రచన::రాజశ్రీ  
గానం::S.P.బాలు 

నటీ,నటులు::కమల్,రాధ,సులక్షణ.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్  మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 
తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 
అమ్మ..మా..అమ్మ..అమ్మ..మా..అమ్మ
కావాలి ఏజన్మకైనా 
తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 

చరణం::1

నీ మాటలె సిరివీణలే..నీ చూపులే నావెలుగులే  
ఈ మలుపు నాకు వరం..ఇక నీ పిలుపు భూపాళం
ఈ మలుపు నాకు వరం..ఇక నీ పిలుపు భూపాళం
వేదం నీ మాట..ఏనాటిదో..మన అనుబంధం

తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 
అమ్మ..మా..అమ్మ..అమ్మ..మా..అమ్మ
కావాలి ఏజన్మకైనా 
తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 

చరణం::2

భవనాలలో ఇంద్రభవనాలలో..భోగాలలో ఆ భాగ్యాలలో 
ఈ పాల మనసేది..ఈ గారాల నిధియేది
ఈ పాల మనసేది..ఈ గారాల నిధియేది
కోరే నాదైవం..నీకన్న నాకింకా వేరేది..ఈ..

తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 
అమ్మ..మా..అమ్మ..అమ్మ..మా..అమ్మ
కావాలి ఏజన్మకైనా 
తెలిసింది ఈ చల్లనైన..నీ ప్రేమ ఈనాటికైనా 

Friday, March 30, 2012

లక్షాధికారి--1963




సంగీతం::టి.చలపతిరావు
రచన::కొసరాజు
గానం::మాధవపెద్ది సత్యం

పల్లవి::

ఓహో అందమైన చిన్నదాన
బంగారు వన్నెదాన
ఓహో నీలిరంగు చీరదాన
భలే నెరజాణ
నా మీద కోపమా...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...

చరణం::1

కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే
కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే
తుపానుగా లేచి తమాషాగా చూచి
నా మనసును దోచి వేశావులే పేచీ
నా మీద కోపమా...

ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...

చరణం::2

వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే
వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే
నీ పోకిరి కళ్లు ఆ కళ్లల్లో థ్రిల్లు
ఎవ్వానికి దక్కు అవ్వానిదే లక్కు
కాదేమో చెప్పుమా...

ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...

చరణం::3

తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి
తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి
నిన్నే కలగంట నువ్వే నా జంట
నీవెంట పడి వస్తా కాదంటే పడి చస్తా
ఇంకేల కోపము...

ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...

Thursday, March 29, 2012

ప్రెసిడెంట్ పేరమ్మ--1979



సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P. బాలు, P.సుశీల 
Film Directed By::K.Viswanaath
తారాగణం::నూతన్ ప్రసాద్,కవిత,రాజబాబు,రమాప్రభ,మంజు భార్గవి,K.V. చలం,సాక్షి రంగారావు

పల్లవి::

హే..అందరాని..సందమామ 
నాకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నామామ..చాలు నాకు
అద్దంలాంటి నామామ..చాలునాకు

హే..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
నే అద్దంలా ఉన్నాను..నువ్వు సూసేందుకు
నే అద్దంలా ఉన్నాను..నువ్వు సూసేందుకు

చరణం::1

ఏటిలోని..నురగల్లాగా
పైట కొంగు..పొంగుతుంటే
లేత గాలి..ఇసురుల్లోనా
పూత వయసు..ఊగుతుంటే

ఇసకతిన్నెలు..గుసగుసమంటే
ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ
మసకా కోరిక..బుస కొడుతుంటే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇసకాతిన్నెలు..గుసగుసమంటే
మసకా కోరిక..బుస కొడుతుంటే

చూడాలి..అప్పుడు
ఈ జోడు గుండెల..చప్పుడు
చూడాలి..అప్పుడు
ఈ జోడు గుండెల..చప్పుడు

హా..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నా మామ..చాలు నాకు
అద్దం లాంటి నా మామ..చాలు నాకు

చరణం::2

నీరెండ..సీరకట్టి
నీలి నీడ రైక..తొడిగి
పొద్దుపొడుపు..తిలకం దిద్ది
పొన్న పూల..నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా..నువ్వొస్తుంటే
ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ
ఊరూ నాడు..పడి చస్తుంటే
హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వనలచ్చిమిలా..నువ్వొస్తుంటే
ఊరూ నాడు..పడి చస్తుంటే

చూడాలి..అప్పుడు 
నన్నేలినోడి..దూకుడు
చూడాలి..అప్పుడు
నన్నేలినోడి..దూకుడు

హే..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ
నే అద్దంలా..ఉన్నాను
నువ్వు..సూసేందుకు

హే..అందరాని..సందమామ 
నాకెందుకూ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నా మామ..చాలు నాకు
అద్దం లాంటి నా మామ..చాలు నాకు

Wednesday, March 28, 2012

రాముడే దేవుడు--1973


సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
ఓహో..గులాబి బాలా..రావేలా     
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
నీదే గులాబి బాలా..రావేలా
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో

చరణం::1

హంసలై నింగిలో..ఎగిరిపోదాములే
మబ్బులై గాలిలో..తేలిపోదాములే
హంసలై నింగిలో..ఎగిరిపోదాములే
మబ్బులై గాలిలో..తేలిపోదాములే
అల్లుకున్న ఆశలన్నీ..పల్లవించాలిలే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో 

చరణం::2

ఏకమై లోకమే..మరచిపోదాములే
యవ్వనం చెరిసగం..పంచుకుందాములే
ఏకమై లోకమే..మరచిపోదాములే
యవ్వనం చెరిసగం..పంచుకుందాములే
జీవితం పాటగా..పాడుకుందాములే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో 

చరణం::3

మమతలే మల్లెలై..విరబూసేనులే
వలపులే వెల్లువై..పొంగిపోయేనులే
మమతలే మల్లెలై..విరబూసేనులే
వలపులే వెల్లువై..పొంగిపోయేనులే
నీవునాలో నేనునీలో..నిండిపోవాలిలే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో 
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
ఓహో..గులాబి బాలా..రావేలా

కోరికలే గుర్రాలైతే--1979
















సంగీతం::సత్యం
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు.P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,జయలక్ష్మీ,మురళీమోహన్,ప్రభ.  

పల్లవి:: 

మనసే మన..ఆకాశం
మనమే..రవిచంద్రులం
ఇటు పగలు..అటు రేయి
ఒకటై వెలిగే..ప్రేమికులం

మనసే మన..ఆకాశం
మనమే..రవిచంద్రులం

చరణం::1

ఒహొహో..ఓ ఓ ఓ..అహహా..ఆ ఆ ఆ
చందమామ నువ్వంట..వెన్నెల్లే నువ్వంట
నీ ముందు నేనుంటే..దివిటీలా ఉంటా
సూరీడి వెచ్చనీ..నీరెండ నువ్వంట
నీ మాట అనుకుంటే..మాటలే రావంట
మాటలకందని..మనిషివి నువ్వంట
మాటలకందని..మనిషివి నువ్వంట
మనుషులకందని..మమతే నీదంట

మనసే మన..ఆకాశం
మనమే..రవిచంద్రులం
ఇటు పగలు..అటు రేయి
ఒకటై వెలిగే..ప్రేమికులం
మనసే మన..ఆకాశం
మనమే..రవిచంద్రులం

చరణం::2

నీకు నీవారుంటే..నాకోసం నువ్వుంట
ఏ ఏటి ఒడ్డున..ఇల్లేల మనకంట
నీ వంటి వానికి..నీ జంట ఇల్లంట 
ఆ ఇంట గోరంత..దీపమై నేనుంటా
గోరంత దీపానికి..ఇల్లంతా వెలుగంట
గోరంత దీపానికి..ఇల్లంతా వెలుగంట
కొండంత దేవునికి..కోవెలే నేనంట

మనసే మన..ఆకాశం
మనమే..రవిచంద్రులం

Korukonna Mogudu--1982
Music::Satyam
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Chandramohan,Jayalakshmi,Murali Mohan ,Prabha

::: 

manasE mana..aakaaSam
manamE..ravichandrulam
iTu pagalu..aTu rEyi
okaTai veligE..prEmikulam

manasae mana..aakaaSaM
manamae..ravichaMdrulaM

:::1

ohohO..O O O..ahahaa..aa aa aa
chandamaama nuvvanTa..vennellE nuvvanTa
nee mundu nEnunTE..diviTeelaa unTaa
sooreeDi vechchanee..neerenDa nuvvanTa
nee maaTa anukunTE..maaTalE raavanTa
maaTalakandani..manishivi nuvvanTa
maaTalakandani..manishivi nuvvanTa
manushulakandani..mamatE needanTa

manasE mana..aakaaSam
manamE..ravichandrulam
iTu pagalu..aTu rEyi
okaTai veligE..prEmikulam
manasE mana..aakaaSam
manamE..ravichandrulam

:::2

neeku neevaarunTE..naakOsam nuvvunTa
E ETi oDDuna..illela manakanTa
nee vanTi vaaniki..nE janTa illanTa
aa inTa gOranta..deepamai nEnunTaa
gOranta deepaaniki..illantaa veluganTa
gOranta deepaaniki..illantaa veluganTa
konDanta dEvuniki..kOvelE nEnanTa

manasE mana..aakaaSam
manamE..ravichandrulam