Friday, April 06, 2012

ఆడదాని అదృష్టం--1975



















సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి,S.P.బాలు   
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే నీవే నీవే
నా తోడూ నీడవు నీవే నీవే నీవే నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే                        

చరణం::1

చీకటి ముసిరే వేళలో వికసించే ఉదయం నీవే 
చీకటి ముసిరే వేళలో వికసించే ఉదయం నీవే
కలతలలో కన్నీళ్ళలో కలతలలో కన్నీళ్ళలో 
కరుణించే హృదయం...నీవే  
నడిపించే దైవం నీవే..నడిపించే దైవం నీవే
నీవే నీవే నా తోడూ నీడవు నీవే నీవే నీవే
నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే    

చరణం::2

ఏ తొలి జన్మలలోనో ఏ పాపాలను చేశామో 
ఏ తొలి జన్మలలోనో ఏ పాపాలను చేశామో
ఆ పాపాలనూ మా లోపాలనూ 
ఆ పాపాలనూ మా లోపాలనూ 
మన్నించే దేవివి నీవే..ఏ 
కాపాడే తల్లివి నీవే కాపాడే తల్లివి నీవే 
నీవే నీవే నా తోడూ నీడవు 
నీవే నీవే నీవే నా తోడూ నీడవు నీవే
చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే

No comments: