సంగీత::T.చలపతిరావ్ రచన::దాశరథి గానం::ఘంటసాల,T.R.జయదేవ్,శరావతి. తారాగణం::అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి,గీతాంజలి,సత్యనారాయణ పల్లవి:: అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా అమ్మా అమ్మా చల్లని..మా అమ్మా..అమ్మా చరణం::1 కన్న తల్లినే ఎరుగములే..మే మెరుగములె మము పెంచిన తల్లివి...నీవేలే అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే ఆ దేవుని మించిన...దేవతవే అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే ఆ దేవుని మించిన...దేవతవే ఓ త్యాగమయి అనురాగమయీ..మా అమ్మా అమ్మా అమ్మా చల్లని మా అమ్మా..అమ్మా చరణం::2 ఎవరో దేవుడు ఎందుకులే..మా కెందుకులే మా పాలిట దైవము...నీవేలే మమతలు పొంగే...హృదయములో నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే మమతలు పొంగే...హృదయములో నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే ఓ త్యాగమయీ అనురాగమయి..మా అమ్మా అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా అమ్మా...అమ్మా..ఆఆఅ