సంగీతం::గాలిపెంచెల నరసింహారావు రచన::సముద్రాల రాఘవాచార్య గానం::P.లీల తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి,గుమ్మడి,నాగయ్య,కాంతారావు,గీతాంజలి,హరనాధ్ పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సరసాల జవరాలను నేనేగదా సరసాల జవరాలను నేనేగదా సరసాల జవరాలను మురిపాలు వెలబోయు భామలలోన మురిపాలు వెలబోయు భామలలోన సరసాల జవరాలను నేనేగదా సరసాల జవరాలను చరణం::1 బంగారు రంగారు మైజిగిలోన బంగారు రంగారు మైజిగిలోన పొంగారు వయసూ పొంకములోన సంగీత నాట్యాల నెైపుణిలోన ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ సంగీత నాట్యాల నెైపుణిలోన నా సాటి నెరజాణ కనరాదుగా సరసాల జవరాలను నేనేగదా సరసాల జవరాలను చరణం::2 మగువల నొల్లని మునియైనా..ఆ మగువల నొల్లని మునియైనా నా నగుమోమునుగన చేజాచడా యాగము యోగము దానములన్నీ యాగము యోగము దానములన్నీ నా బిగికౌగిలి సుఖమునకేగా సరసాల జవరాలను నేనేగదా సరసాల జవరాలను
రచన::సముద్రాల రాఘవాచార్య సీనియర్
సంగీతం::గాలిపెంచల నరసింహా రావ్
గానం::P. సుశీల బౄందం రాగం::మధ్యమావతి
సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి