సంగీతం::రమేష్ నాయుడు రచన::దాసం గోపాలకృష్ణ గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::మురళీ మోహన్,జయసుధ,హరిప్రసాద్,మోహన్ బాబు,సుబాషిణి,నిర్మల పల్లవి:: మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ ఆ..ఆ..మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ యశోదమ్మ ఇంటిలోన కృష్ణమూర్తీ వెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తీ మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తీ సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా సరసమైన ధర చెప్పు ఓ మందయానా ఆ..ఆ.. సరసమైన ధర చెప్పు ఓ మందయానా తల్లి చాటు పిల్లనయ్యా కృష్ణమూర్తీ మా నాయనమ్మ నడగాలయ్యా కృష్ణమూర్తీ