సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::పింగళి గానం::ఘంటసాల Film Directed By::Kadiri Venkata Reddy తారాగణం: N.T. రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల పల్లవి:: కుండ కాదు కుండకాదు..చినదానా నా గుండెలదరగొట్టినావే..చినదానా కుండ కాదు కుండకాదు..చినదానా నా గుండెలదరగొట్టినావే..చినదానా చరణం::1 పరుగిడితే అందాలన్నీ..ఒలికిపోయెనే తిరిగిచూడ కన్నులలోనా..మెరుపు మెరిసినే ఒలికిన అందాలతో..మెరిసిన నీ చూపులతో ఎంత కలచినావో నన్నూ ఎరుగవైతివి ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు చినదానా నా గుండెలదరగొట్టినావే..చినదానా చరణం::2 మొదటి చూపులోనే మనసు.. దోచికొంటివే ఎదుటపడిన నీ వలపు..దాచుకొంటివే దోచుకున్న నా మనసు..దాచుకున్న నీ వలపు అల్లిబిల్లి అయినాగానీ..తెలియవైతివే ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు చినదానా నా గుండెలదరగొట్టినావే..చినదానా చరణం::3 నన్ను చూచు కోరికతోనే..వచ్చినావుగా నిన్ను చూచు ఆశతోనే..వేచినానుగా వచ్చినట్టే నీ నెపము..వేచినట్టే నాతపము ఫలము నిలుపుకొందమన్నా..నిలువవైతివే ఓహో హో హో..కుండ కాదు కుండ కాదు..చినదానా నా గుండెలదరగొట్టినావే..చినదానా
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::పింగళి గానం::ఘంటసాల,P.సుశీల Film Directed By::Kadiri Venkata Reddy తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల పల్లవి:: అతడు::- నీవు లేక నిముసమైన నిలువ జాలనే ఆమె::- నీవు లేక నిముసమైన నిలువ జాలనే అతడు::- నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ ఆమె::- నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ అతడు::- ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ ఆమె::- ఈ..ఈ..ఈ..విరియ జేసినదీ నీవు లేక నిముసమైన నిలువ జాలనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::1 అతడు::- లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా ఆమె::- లోకమంతా నీవు గానే నాకు తోచెనుగా అతడు::- మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా ఆమె::- మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా ఆ..మదిని పూసెనుగా నీవు లేక నిముసమైన నిలువ జాలనే చరణం::2 అతడు::- ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా ఆమె::- ఒకరి కోసం ఒకరిమనినా ఊహ తెలిసెనుగా అతడు::- వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా ఆమె::- వీడిపోని నీడ ఓలె కూడి ఉందుముగా ఆ..ఆ..కూడి ఉందుముగా.. నీవు లేక నిముసమైన నిలువ జాలనే నీవే కాదా ప్రేమ నాలో విరియ జేసినదీ ఈ..ఈ..విరియ జేసినదీ
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::పింగళి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు, B. సరోజాదేవి, రాజనాల, గీతాంజలి, పద్మనాభం, ముక్కామల పల్లవి:: వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా హోయ్ వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం::1 వనమునేలు బాలరాణి ఎవరో అంటూ నగరునేలు బాల రాజు చూడరాగా వనమునేలు బాలరాణి ఎవరో అంటూ నగరునేలు బాల రాజు చూడరాగా కోకిలమ్మ పాట పాడా నెలిమి పిట్ట ఆటలాడా సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లుమనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరద రాజా చరణం::2 కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ కొండలోన కోనలోనా తిరిగే వేళా అండదండ నీకు నేనే ఉండాలంటూ పండు వంటి చిన్నవాడు నిండు గుండె వన్నెకాడు చేర రాగ కాలి అందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా చరణం::3 కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా కొండపైన నల్ల మబ్బు పందిరి కాగా కోనలోన మెరుపూ తీగే తోరణ కాగా మల్లెపూల తేరు పైన పెళ్లికొడుకు రాగానే వాణ్ణి చూసి నా మనసు వళ్లె వళ్లే వళ్లే యనగా వాన కాదు వాన కాదు వరదా రాజా పూల వాన కురియాలి వరదరాజా