Tuesday, November 18, 2014

దానధర్మాలు--1976


సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీ కొండిశెట్టి శ్రీ రామారావు 
గానం::సుశీల
Film Directed By::?
Film Producer By::
తారాగణం::?

పల్లవి::

నీలాల నింగిలోన..పగడాల పందిరివేసి 
రతనాల రంగులతో..ముత్యాల ముగ్గులు వేద్దమా..ఆ
ముత్యాల ముగ్గులు వేద్దమా..ఆ

చరణం::1

పుష్పరాగములతో..పొదిగిన పచ్చలతో
పుష్పరాగములతో..పొదిగిన పచ్చలతో
కెంపులతో సొంపుగనూ..వజ్రాల వంపులు తీర్చిన
ఆ వయ్యారి భామవు నీవే..వరసైన చినదాన  

వరసైనదానిని కాను..ఆ సిసలైన దానిని నేను
సిగ్గు తెర తీసి చెప్పాను నేను..చేసుకుంటాను నిన్నేననీ
ఒప్పుకుంటే కదా నిన్ను నేను..చేశారు ఈ పెళ్ళి మనకు
మూడుముళ్ళు విప్పిన కూడా..పోలేవు ముందుకు నీవు
పోలేవు ముందుకు...నీవు 

చరణం::2

మనసైన మగువతో మాటాడకుండ..లేను 
మనసైన మగువతో మాటాడకుండ..లేను 
నిన్ను విడిచి నిముషమైన..నిలువలేను ఈ జగాన
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ప్రేమగ చూస్తే చాలు..నీ పాద పూజ చేస్తాను
జన్మజన్మలకైనా నిన్నే కోరుకుంటాను..నిన్నే కోరుకుంటాను

నీలాల నింగిలోన..పగడాల పందిరివేసి 
రతనాల రంగులతో..ముత్యాల ముగ్గులు వేద్దమా..ఆ
ముత్యాల ముగ్గులు వేద్దమా..ఆ

DaanaDharmaalu--1976
Music::Master Venu
Lyrics::Kondisetti Sreeramarao 
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By::
Film Producer By::
Cast::

::::::::::

neelaala ningilOna..pagaDaala pandirivEsi 
ratanaala rangulatO..mutyaala muggulu vEddamaa..aa
mutyaala muggulu vEddamaa..aa

::::1

pushparaagamulatO..podigina pachchalatO
pushparaagamulatO..podigina pachchalatO
kempulatO sompuganoo..vajraala vampulu teerchina
aa vayyaari bhaamavu neevE..varasaina chinadaana  

varasainadaanini kaanu..aa sisalaina daanini nEnu
siggu tera teesi cheppaanu nEnu..chEsukunTaanu ninnEnanee
oppukunTE kadaa ninnu nEnu..chESaaru ee peLLi manaku
mooDumuLLu vippina kooDaa..pOlEvu munduku neevu
pOlEvu munduku...neevu 

::::2

manasaina maguvatO maaTaaDakunDa..Enu 
manasaina maguvatO maaTaaDakunDa..lEnu 
ninnu viDichi nimushamaina..niluvalEnu ee jagaana
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
prEmaga choostE chaalu..nee paada pooja chEstaanu
janmajanmalakainaa ninnE kOrukunTaanu..ninnE kOrukunTaanu

neelaala ningilOna..pagaDaala pandirivEsi 
ratanaala rangulatO..mutyaala muggulu vEddamaa..aa
mutyaala muggulu vEddamaa..aa 

No comments: