Friday, August 15, 2014

దేశభక్తి గీతాలు


భారతి మా కన్న తల్లి భాగ్యోదయ కల్పవల్లి 
విశ్వశాంతి విరియించిన చిరునవ్వుల శిరసు మల్లి

వాధిత్రయ భవ్య వాసనా వింధ్యాచల విసద రచన 
కాస్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన 

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని 
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని

భారతి బంగరు ముంగిట భగవంతుడె  పారాడెను 
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను 

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను 
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను 

Desabhakti Geetaalu

Bhaarati maa kanna talli Bhaagyodaya kalpavalli
Viswasanti viriyinchina chirunavvula sirasu malli

Vadhitraya bhavya vaasana Vindhyaachala visada rachana
Kaasmirapu rasmi vadana nirmala guna nikhila sadana

Sannuta himasikharamu vale unnata mastaka sobhini
Pavana ganga nadi vale jivana gitaadayini

Bhaarati bangaru mungita bhagavantude paaraadenu
Rushi santati gontu vippi rushulu chakkaga paadenu

Kshamataa ketanamettenu samata senkhamunottenu
Vitarana guna gouravamuna viswamune munchettenu

No comments: