Saturday, July 21, 2007

ఆలీబాబా 40 దొంగలు--1970



శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం::B. విఠలాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం:::N.T.రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ

పల్లవి::

లా..ల..లల..లా..లలాలాలా
ఆకతాయి..ఒట్టి ఆకతాయి  
హ..హా..హా
రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్

చరణం::1

నీ కోసమే రేయి ఆగింది
నిను చూసి తనువేమో రేగింది
మదిలోని సెగలోన మరిగింతునోయి
మదిలోని సెగలోన మరిగింతునోయి
దిక్కుల తీరే చుక్కల లోకం చూపించేనోయీ..ఈ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::2

కొండల్లో తిరిగేటి సింహాము
వేసింది కుందేటి వేషము
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
మంచి తరుణం ఇది
మించి పోవునని మాటు వేసినోయీ..ఈ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::3

కొల్లగొట్టి కోటలెన్నో కట్టారు
కత్తుల బోనులో కాలు పెట్టారు
పులినోట తల దూర్చి పోలేరులే
పులినోట తల దూర్చి పోలేరులే
ఎత్తులు జిత్తులు ఎన్నైనా గమ్మత్తుగ చిత్తవులే..ఏ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::4

మక్కువయేలేని మగువ పక్కలోన బల్లెము
కంగారైతే కలిసొచ్చే కాలమే కాదురోయ్
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
ఇంటిలోన సర్కారేమో భలే ఇరుకున పడ్డారూ..ఊ

రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్
రావోయి..రావోయి..రావోయి

No comments: