Thursday, July 30, 2015

పల్నాటి పౌరుషం--1994



సంగీతం::A.R.రెహమాన్
రచన::శివగణేష్ 
గానం::మనో,సుజాత.
తారాగణం::కృష్ణంరాజు,రాధిక,చరణ్‌రాజ్,బ్రహ్మానందం. 

పల్లవి::

మేనత్త కూతిరివే మెరుపంటి మరదలివే
మదిలోన మదనుడికే మరుమల్లె జాతరవే
పొట్టిజల్ల పాలపిట్ట పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పున్నమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగెదెట్టా..ఆ

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపించే

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా

చరణం::1

కంటికీ కునుకే రాదాయే
నోటికీ మెతుకే చేదాయే
ఒంటిలో తాపం ఏదో మొదలాయే..ఏ
ఎక్కడో కాకులు కూస్తున్నా
ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వనే వెతికే గుండెకి గుబులాయే..ఏ
నావకడ గట్టిగ అరిచానూ
బావ సడి గుట్టుగ అడిగానూ
గాలితో కబురులు పంపానూ
మబ్బుతో మనసులు తెలిపానూ
దేనికీ బాదులే రాకా కుదురే లేకా కన్నీరొలికానూ
ముద్దుల బావా నన్నిక ఇడిసి పోవద్దూ
ఈ మరదలి ప్రాణం నీపై ఉందని మరవద్దూ

రాగాల సిలకా రంగేలి మొలకా..ఆ
రాయంచ నడకా రాబ్యాకు తళుకా..ఆ

చరణం::2


కళ్ళలో కలతలు తీరేనా
కాళ్ళపై వాతలు మాసేనా
రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా
దాగనీ సొగసులు పొంగేనా
దాగినా దారులు తెరిచేనా
కొంగులో కోలాటాలే కోరేనా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ముందుగా బంధం వేసిన హృదయం లోనికి విందుకు వస్తున్నా
మరదలు పిల్లా నిన్నిక విడిచీ వెళ్ళనులే
మన పెళ్ళికి లగ్గం దగ్గరిలోనే ఉన్నదిలే

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపించే
రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా

No comments: