Wednesday, July 04, 2007

శ్రీ కృష్ణార్జున యుద్ధం--1963::ఆనందభైరవి::రాగం



సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావు
రచన::పింగళి నాగేంద్ర రావు 
గానం::ఘంటసాల 
తారాగణం::N.T. రామారావు,అక్కినేని,కాంతారావు,B. సరోజాదేవి,S. వరలక్ష్మి, ధూళిపాళ,
అల్లు రామలింగయ్య.

ఆనందభైరవి::రాగం   

పల్లవి::

సోహం..సోహం..సోహం..సోహం

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 
అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

చరణం::1

అయిన కుదురుగ ఎదుట 
కూర్చుని గాలి గట్టిగా పీల్చుమా
స్వామీ స్వామీ..ఏమీ ఏమీ
నేను పీల్చిన..గాలి నిలువక 
అకటా మీపై..విసిరెనే
అకట మీపై..విసిరినే 
అందుకే..మరి 

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

చరణం::2

ఐన కన్నులు మూసి చూపును
ముక్కు కొనపై..నిలుపుమా..ఆ
స్వామీ స్వామీ..ఈ మారేమీ
అచట నిలువక..చుపులన్నీ 
అయ్యో..మీపై దూకెనే..ఏఏఏఏ
అయ్యో..మీపై దూకెనే..ఏఏఏఏ 
అదే..మరి 

అంచెలంచెలు లేని మోక్షము 
చాల కష్టమే భామినీ
కష్టమైనను ఇష్టమేనని 
కోరి నిలిచితి చినమునీ 

No comments: