Thursday, June 19, 2014

వియ్యాలవారి కయ్యాలు--1979



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::కృష్ణ,జయప్రద,నాగభూషణం,రావు గోపాలరావు,సూర్యకాంతం,S.వరలక్ష్మి,జయమాలిని

పల్లవి::

ఓ..కలలోని ఊర్వశీ 
కల కాని..ప్రేయసీ
వచ్చాను వలపే నీవని
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే

ఓ..ఓ..ఓ..ఓ..ఓ
అనురాగ...మాలిక
అందాల...ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే

చరణం::1

నీ సోకులన్నీ కను సోకగానే
పులకింత నాలో పలికిందిలేవే
నిను చూడగానే నిలువెల్ల పొంగే
నను తాకగానే తనువెల్ల ఊగే
నా రాగాలలో డోలలూగాలిలేవే 
ఓ..అనురాగ మాలిక 
అందాల...ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే 

చరణం::2

జత చేరగానే జడివాన కురిసే
జడివానలోనే ముడికాస్త బిగిసే
నీ గుండెలోనే తలదాచుకోనీ
నీ ఎండలోనే తడి ఆర్చుకోనీ

ఈ వానల్లో వలపంతా 
వరదల్లే పొంగే
ఓ కలలోని ఊర్వశీ
కల కాని ప్రేయసీ
వచ్చాను వలపే నీవని
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
అహా..హ..హా

No comments: