Thursday, June 14, 2007

శ్రీ పాండురంగ మహత్యం--1957



సంగీతం::T.V. రాజు
రచన::సముద్రాల (సీనియర్)
గానం:: నాగయ్య
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి (తెలుగు చిత్రసీమకి తొలి పరిచయము),అంజలీదేవి, నాగయ్య,పద్మనాభం,K.శివరావు,ఛాయాదేవి,పేకేటి శివరాం

పల్లవి::

సన్నుతి సేయవె..మనసా
ఆపన్న శరణ్యుని హరిని..ఈ..ఈ
సన్నుతి సేయవె..మనసా
ఆపన్న శరణ్యుని హరిని..ఈ..ఈ
సన్నుతి సేయవె..మనసా
చక్రధారి కౌస్తుభహారి
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారి
పాపహారి కృష్ణమురారరి
సన్నుతి సేయవె..మనసా

చరణం::1

మరులు గొలిపే సిరులు 
మేను నిలువబోవే మనసా
మరులు గొలిపే సిరులు 
మేను నిలువబోవే మనసా
స్థిరముగానీ ఇహభోగము 
పరము మరువకె మనసా
గోపబాలుని మురళీలోలుని
గోపబాలుని మురళీలోలుని
సన్నుతి సేయవె మనసా
చక్రధారి కౌస్తుభహారి
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారి
పాపహారి కృష్ణమురారి
సన్నుతి సేయవె మనసా

చరణం::2

ఆదిదేవుని పాదసేవే 
భవపయోధికి నావ..ఆ
ఆదిదేవుని పాదసేవే 
భవపయోధికి నావ..ఆ
పరమయోగులు చేరగగోరే 
పరమపదవికి దోవ..ఆ
శేషశాయిని మోక్షాదాయిని
శేషశాయిని మోక్షాదాయిని
సన్నుతి సేయవె మనసా
ఆపన్న శరణ్యుని హరిని
సన్నుతి సేయవె మనసా
చక్రధారి కౌస్తుభహారి
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారి
పాపహారి కృష్ణమురారి
సన్నుతి సేయవె మనసా

No comments: