Saturday, May 02, 2015

సిరివెన్నెల--1986::అమృతవర్షిణి::రాగం



సంగీతం::K.V.మహదేవన్ 
రచన::సీతారామ శాస్త్రి 
గానం::S.P.బాలు 

అమృతవర్షిణి::రాగం 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు
ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి..ఈ నేల

చరణం::1

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాత తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా
ఎగసేను నింగి దాకా
ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి..ఈ నేల

చరణం::2

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై
తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై
గగనగళము నుండి అమర గానవాహిని
గగనగళము నుండి అమర గానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని
ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే

No comments: