Friday, May 01, 2009

రామరాజ్యంలో రక్తపాతం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,గుమ్మడి,జగ్గయ్య,పద్మనాభం,విజయనిర్మల,లత, షీలా,
జయమాలిని,రావు గోపాల రావు

పల్లవి::

ఎందుకోసమొచ్చావు..తుమ్మెదా
నువ్వేమి కోరివచ్చావు..తుమ్మెదా
ఎందుకోసమొచ్చావు..తుమ్మెదా
నువ్వేమి కోరివచ్చావు..తుమ్మెదా 
తొంగి తొంగి చూశావు దొంగలాగా చేరావు 
తుమ్మెదా...గండు తుమ్మెదా
తుమ్మెదా...గండు తుమ్మెదా

చరణం::1

విందుకోసమొచ్చింది తుమ్మెదా 
నీ పొందుగోరి వచ్చింది తుమ్మెదా
విందుకోసమొచ్చింది తుమ్మెదా  
నీ పొందుగోరి వచ్చింది తుమ్మెదా 
నిన్ను విడవనంటు౦దీ నీతోనే వుంటు౦ది
తుమ్మెదా...గండు తుమ్మెదా 
తుమ్మెదా...గండు తుమ్మెదా 

ఆశపడి వచ్చిందిలే అందులో అర్ధమేదొవుంటు౦దిలే 
అందాలు చూచిందిలే అందుకే ఆవురావురంటు౦దిలే
ఆశపడి వచ్చిందిలే అందులో అర్ధమేదొవుంటు౦దిలే
నీ అందాలు చూచిందిలే అందుకే ఆవురావురంటు౦దిలే

చరణం::2

గుట్టుమట్టు లేకుండా 
పట్టపగలు అనకుండా 
ముట్టుకుంటే తప్పేనులే
ఆకుచాటు పిందెలన్ని 
కొమ్మచాటు పువ్వులన్ని
నిన్నుచూచి నవ్వేనులే
గుట్టుమట్టు లేకుండా 
పట్టపగలు అనకుండా 
ముట్టుకుంటే తప్పేనులే
ఆకుచాటు పిందెలన్ని 
కొమ్మచాటు పువ్వులన్ని
నిన్నుచూచి నవ్వేనులే
ఎందుకోసమొచ్చావు తుమ్మెదా
నువ్వేమి కోరివచ్చావు తుమ్మెదా
నిన్ను విడవనంటు౦దీ నీతోనే వుంటు౦ది
తుమ్మెదా...గండు తుమ్మెదా 
తుమ్మెదా...గండు తుమ్మెదా 

చరణం::3

కన్నెమీద మనసుందిలే 
ఇ౦దులో కల్లమాటయేముందిలే
చిలిపినవ్వు నవ్విందిలే 
మనసులో వలపువానకురిసిందిలే
కన్నెమీద మనసుందిలే 
ఇ౦దులో కల్లమాటయేముందిలే
చిలిపినవ్వు నవ్విందిలే 
మనసులో వలపువానకురిసిందిలే
వెన్న దొంగ కన్నెదొంగ మనసుదోచుకున్నదొంగ 
నీలోనే వున్నాడులే
తీపి తీపి తేనెలన్ని తెచ్చి కానుకిచ్చుకొంటే 
ఆశలన్నితీరేనులే
ఎందుకోసమొచ్చావు..తుమ్మెదా
నువ్వేమి కోరివచ్చావు..తుమ్మెదా
తొంగి తొంగి చూశావు  
దొంగలాగా చేరావు..తుమ్మెదా..గండు తుమ్మెదా 
విందుకోసమొచ్చింది..తుమ్మెదా 
నీ పొందుగోరి వచ్చింది..తుమ్మెదా 
నిన్ను విడవనంటు౦దీ నీతోనే వుంటు౦ది
తుమ్మెదా గండు..తుమ్మెదా
తుమ్మెదా గండు.తుమ్మెదా   

No comments: