Wednesday, May 16, 2007

రాజు వెడలె-1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,మాధవపెద్ది సత్యం,రమేష్ 
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి

పల్లవి::

తాత తాత తాత పీత పీతా పీత 
తాత తాత తాత పీత పీతా పీత  
ముంజెకాయ మూతా కొడవలెట్టి కోతా 
నంజు నా చేతా నీ వీపు మోతా
తాత తాత తాత పీత పీతా పీతా 
ముంజెకాయ మూతా కొడవలెట్టి కోతా 
నంజు నా చేతా నీ వీపు మోతా 
తాత తాత తాత పీత పీతా పీతా

చరణం::1

చల్‌ చల్‌ గుర్రం చలాకి గుర్రం 
చల్‌ చల్‌ గుర్రం చలాకి గుర్రం 
గుర్రమేమొ గుడ్డిది దానాకు దొడ్డది 
తన్నబోయి తానే వెల్లగిల్ల పడ్డది
గుర్రమేమొ గుడ్డిది దానాకు దొడ్డది 
తన్నబోయి తానే వెల్లగిల్ల పడ్డది
సిరి సిరి బొజ్జ చెరువంత బొజ్జ 
సిరి సిరి బొజ్జ చెరువంత బొజ్జ
దొంగకూళ్ళు తిన్నది బుడగల్లే వుబ్బింది 
తొక్కు తొక్కినావంటే నిజం కక్కుతుంది
తాండవ కృష్ణా తారంగం కాళీమర్ధన తారంగం 
తాండవ కృష్ణా తారంగం కాళీమర్ధన తారంగం
తాత తాత తాత పీత పీతా పీతా 
ముంజెకాయ మూతా కొడవలెట్టి కోతా 
నంజు నా చేతా నీ వీపు మోతా 
తాత తాత తాత పీత పీతా పీతా

చరణం::2

బాబూ అనాధవెట్లా అయినావు నాయనా  
తాత తరిమి వేసెనా తండ్రి విడిచి వెళ్ళెనా
కన్నతల్లికే నువ్వు భారమై పోతివా
తాత తరిమి వేసెనా తండ్రి విడిచి వెళ్ళెనా
కన్నతల్లికే నువ్వు భారమై పోతివా
కాదు కాదు బాబు కటిక నిజం చెప్పనా
కాదు కాదు బాబు కటిక నిజం చెప్పనా 
కాసులున్న వాళ్ళ పనీ కాపురాలు తీయుటే 
పట్టిలాగు మీసాలు బైటపెట్టు మోసాలు
గుండు నున్నగ కొట్టించు బొగ్గు నామం పెట్టించు
తాటాకులనూ కట్టించు గాడిదపైన తిప్పించు  
తాత తాత తాత పీత పీతా పీతా
ముంజెకాయ మూతా కొడవలెట్టి కోతా 
నంజు నా చేతా నీ వీపు మోతా
తాత తాత తాత పీత పీతా పీతా 

No comments: