సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద,పండరీబాయి
పల్లవి::
చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు
చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు
నీ టక్కులన్ని సాగుతాయి అనుకోకూ
నీ తిక్క వదిలిపోతుంది ఒక రోజు ఇది తొలిరోజు
చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు
చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు
చరణం::1
హలో ఓల్డ్ ఫెలో కమాన్ జాయిన్ ఐసే
ఇందరి చెమటను కొందరి సెంటుగ మార్చే ఫ్యాక్టరీ నిలబడదు
ఆకలి మంటతో ఆవిరియంత్రం నడపాలంటే వీల్లేదు
ఇందరి చెమటను కొందరి సెంటుగ మార్చే ఫ్యాక్టరీ నిలబడదు
ఆకలి మంటతో ఆవిరియంత్రం నడపాలంటే వీల్లేదు
పాత రోజుల బూజు దులిపి బైటపడితే బతుకుతావు
పాటుబడే ఈ మనుషులతోటే కలిసివస్తేనే వుంటావు
చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు
చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు
నీ టక్కులన్ని సాగుతాయి అనుకోకూ
నీ తిక్క వదిలిపోతుంది ఒక రోజు ఇది తొలిరోజు
మై డియర్ పూర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్
పేదవాడుగా పుట్టడమే నీ నేరం కాదు డియర్ బ్రదర్
పిరికివాడు బతకడమే మహాపాపము హియర్ హియర్
పేదవాడుగా పుట్టడమే నీ నేరం కాదు డియర్ బ్రదర్
పిరికివాడు బతకడమే మహాపాపము హియర్ హియర్
ఊకదంపుడు ఊర నాయకుల ఊరేగించకు హియరాప్టర్
ఓటంటే, ఒక నోటనుకుంటే వస్తాడెవడో లోఫర్
అండర్ స్టాండ్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు
చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు
చరణం::2
యూ ఎక్స్ ప్లాయిటర్స్ లిజెన్ టు మి
వీళ్ళే మనకు భాగస్వాములు వీళ్ళే యికపై పాలకులు
ఆన్నెం పున్నెం ఎరుగని వీళ్ళు ఆగ్రహమొస్తే కార్చిచ్చులు
వీళ్ళే మనకు భాగస్వాములు వీళ్ళే యికపై పాలకులు
ఆన్నెం పున్నెం ఎరుగని వీళ్ళు ఆగ్రహమొస్తే కార్చిచ్చులు
జాతిమతాల గోతులు పూడ్చి నీతులు కొత్తవి రాస్తారు
జాతిపిత మన బాపూ చెప్పిన సమతా జగతిని తెస్తారు
చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు
నీ టక్కులన్ని సాగుతాయి అనుకోకూ
నీ తిక్క వదిలిపోతుంది ఒక రోజు ఇది తొలిరోజు
No comments:
Post a Comment