Saturday, May 14, 2011

ఆనంద నిలయం--1971


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::K.G.R.శర్మ
గానం::P.సుశీల
తారాగణం::కాంతారావు, కృష్ణకుమారి, చలం, రాజనాల, రేలంగి, వాణిశ్రీ,రమణారెడ్డి,
సూర్యకాంతం, హేమలత

పల్లవి::

గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది
తాళలేక చిన్నది పాపం తల్లడిల్లుచున్నది..హ..హ          
లాలిలాల..లాలిలాల..లాలిలాలల
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

మూగనోము పడితే మాత్రం..మొగము చెప్పడం లేదా
మాయదారి వయసోయమ్మా..మాట వినదు లేవమ్మా         
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

దిక్కుమాలిన సిగ్గొకటి..యెక్కడిదో మరి వచ్చిందమ్మా
తమలపాకు యీ లేతచెక్కిలి కందగడ్డగా కందిందమ్మా         
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

కొంటెతనంతో మెరిసే కళ్ళు..బరువుగా వాలినవమ్మా
ఒళ్ళు మసిలిపోతోందమ్మా..ప్రేమ జ్వరము యే మోనమ్మా    
గూటిలోని పిల్లకు..గుండె ఝల్లుమన్నది

No comments: