Thursday, January 15, 2015

గాజుల కిష్టయ్య--1975


సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు
Director::Adurthi Subba Rao 
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం   

పల్లవి::

వద్దు వద్దు రా..ఆ..ఆఆఆఆఆఆ  
ఈ పాపం మాత్రం చేయద్దురా..ఆఆఆ 
దేవాలయాలలో దేవుడు ఉన్నాడో లేడో
ప్రేమించిన హృదయాలలో మాత్రం
తప్పక ఉన్నాడు వాడు అక్కడే ఉంటాడు
వాడికి ద్రోహం చేయద్దు వాటిని దూరం చేయద్దు

వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు

చరణం::1

పిరికివాళ్ళేన్నడూ ప్రేమించరాదు 
ప్రేమ ఒకసారి రగిలితే ఆరిపోదు..ఊఊఊఊ
అగ్గివంటి అనురాగాన్ని భయపడి దాచద్దు..ఊఊ
నీ గుండెను నిప్పు  కుండగా చేసుకు మోయద్దు
ఎప్పుడో బద్దలవుతుంది ఎందరినో బలి గొంటుఒ౦ది
మూగ బాధ నీ గొంతును నులుమి నిజాన్ని దాస్తుంది 
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు..ఊఊ

చరణం::2

ఏడ్పించి ప్రేమను ఓడించలేవు –అది
ఎంత వెచ్చని కన్నీరైతే అంత రెచ్చిపోతుంది
కలిమిని వలపును ఒకే త్రాసులో తూకం వేయద్దు
కులము మతమను కొలబద్దలతో కొలిచి చూడవద్దు
మనిషిని మనసుతో కొలవాలి మనసును మమతతో తూచాలి
మేడలు గోడలు ఆపవు వలచిన హృదయాన్నీ                
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
వద్దు వద్దు రా..ఆఆఆ..ఈ పాపం మాత్రం చేయద్దురా..ఆఆఆఆఆ 

No comments: