Tuesday, May 13, 2014

శ్రీకృష్ణావతారం--1967



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల,P.లీల  
తారాగణం::N.T.రామారావు,శోభన్‌బాబు,ముక్కామల,సత్యనారాయణ,నాగయ్య,దేవిక,కాంచన,

పల్లవి::
'
నీ చరణ కమలాల నీడయే చాలు 
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు 
ఎందుకోయీ స్వామి బృందావనాలు 

నీ నయన కమలాల నేనున్న చాలు 
ఎందుకే ఓ దేవీ నందన వనాలు 
నీ నయన కమలాల నేనున్న చాలు 
ఎందుకే ఓ దేవీ నందన వనాలు 

చరణం::1

నును మోవి చివురుపై 
నను మురళిగా మలచి పలికించరా
ఆఆఆఆఆఆఆఆ
పలికించరా మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో 
వినలేని రాగాలు పలికింతునే 
మోవిపై కనరాని మురళిలో 
వినలేని రాగాలు పలికింతునే 
మధురానురాగాలు చిలికింతునే

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు 
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు 
ఎందుకే ఓ దేవి బృందావనాలు

చరణం::2

తులసీ దళాలలో తొలివలపులందించి 
తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా..ఆఆఆఆఆఆఆఆ
పూజింతునా స్వామి పులకింతునా 
పూజలను గ్రహియించి పులకింతలందించి
పూజలను గ్రహియించి పులకింతలందించి 
లోలోన రవళింతునే..ఏఏఏఏఏఏ 
లోలోన రవళింతునే 
ఓ దేవి నీలోన నివసింతునే  
ఓ దేవి నీలోన నివసింతునే 

నీ చరణ కమలాల నీడయే చాలు 
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు 
ఎందుకే ఓ దేవీ నందనవనాలు 
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు 
ఎందుకోయీ స్వామి నందనవనాలు

No comments: