Wednesday, March 23, 2011

రామచిలక--1978

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5521
సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీ రాదు 
మనువాడె పెళ్ళికొడుకెవరే 
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీ రాదు 
మనువాడె పెళ్ళికొడుకెవరే

చరణం::1

ఏరులాంటి వలపు..ఎల్లువైనా వరకు
ఎన్నెలంతా ఏటిపాలై ఎదురీదేనా
ఏరులాంటి వలపు..ఎల్లువైనా వరకు
ఎన్నెలంతా ఏటిపాలై ఎదురీదేనా
తుమ్మెదెవరో..తుమ్మెదెవరో
రాకముందే తుళ్ళి పడినా కన్నె పువ్వా
ఈడు కోరు తోడు లేక కుములుతున్న ప్రేమ మొలక
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీ రాదు 
మనువాడె పెళ్ళికొడుకెవరే

చరణం::2

గొంతులోని పిలుపు..గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే..మూగవోయేనా
గొంతులోని పిలుపు..గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే మూగవోయేనా
గోరువంకా..గోరువంకా దారి వంక ఎన్నెలంతా తెల్లవారే
పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీ రాదు 
మనువాడె పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే

No comments: