Thursday, March 26, 2015

సెక్రేటరి -1976



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,రంగనాథ్,రాజబాబు,కాంచన,రమాప్రభ,సూర్యకాంతం

పల్లవి::

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::1

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::2

మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
రానిదానికై కన్నీళ్లు..రానిదానికై కన్నీళ్లు
రాతి బొమ్మకు నైవేద్యాలు 
మనసులేని బ్రతుకొక నరకం

చరణం::3

తరుముకొచ్చే జ్ఞాపకాలు..ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతు తెచ్చే అందాలు..కూలిపోయిన శిల్పాలు

కన్ను నీదని..వేలు నీదని..పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
మనసులేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం
మనిషికెక్కడ వున్నది స్వర్గం..మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం..మ్మ్ మ్మ్ 

No comments: