Sunday, March 02, 2014

అమ్మాయి పెళ్ళి--1974



సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::N.T.రామారావు, P. భానుమతి, చంద్రమోహన్,వెన్నెరాడై నిర్మల,లత,పద్మనాభం.

పల్లవి::

పాలరాతి బొమ్మకు..నీ వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు..నీ సొగసెక్కడిది..ఈ..ఈ

నెలరాజులోనా..వలరాజులోన..నీ వలపెక్కడిది
నెలరాజులోన..నీ చలువెక్కడిది
వలరాజులోన..నీ వలపెక్కడిది..ఈ..ఈ

పాలరాతి బొమ్మకు..పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ

చరణం::1

కలువపూలు తెల్లవారితే..కమిలిపోవును 
నీ కనులైతే కలకాలం..వెలుగుచిందును 
కలువపూలు తెల్లవారితే...కమిలిపోవును 
నీ కనులైతే కలకాలం..వెలుగుచిందును 

ఆ..ఆ..మధువు తీపి అంతలోనే..మాసిపోవును
నీ పలుకు తీపి బ్రతుకంతా..నిలిచియుండును

పాలరాతి బొమ్మకు..ఊ..వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ
నెలరాజులోనా..వలరాజులోన..నీ వలపెక్కడిది

చరణం::2

నీలినీలి మేఘాలు..గాలికి చెదిరేను నీ 
కురుల నీడ ఎల్లప్పుడు...నాకే దక్కేను 
నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను 
కురుల నీడ ఎల్లప్పుడు..నాకే దక్కేను 

ఆ..ఆ..గలగలమని సెలయేరు కదలిపోవునూ 
కానీ..నీలోని అనురాగం నిలిచి ఉండును 

పాలరాతి బొమ్మకు..నీ వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది..ఈ..ఈ
నెలరాజులోనా..వలరాజులోన..నీ వలపెక్కడిది
లాలలలాలలాలాలలలా..
లాలలలాలలాలాలలలా..

No comments: