Thursday, March 08, 2012

రాముడే దేవుడు--1973

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4544
సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ
అవి జతగానే బతకాలని..కలగంటు వున్నాయి 
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ

చరణం::1

చూపులేనిదానికొకటి..కాపువున్నదీ
తోడులేని దాని కొకటి..జోడైనదీ
జంటగువ్వ వెంటవుంటే..పొంగిపోతదీ
ఒక్క క్షణం దూరమైతే..కుంగిపోతదీ
అది ఏనాటి బంధమో..అరెంటిని కలిపిందీ      
ఒకే తోటలోన..ఒక గూటిలోన  
చేరాయి రెండు...గువ్వలూ 
చేరాయి రెండు...గువ్వలూ

చరణం::2

తనువులేమొ వేరైనా..మనసు ఒక్కటే
గుండెలేమొ రెండైన..ప్రాణమొక్కటే
ఎక్కడ అవి పుట్టాయో..తెలియదెవరికి
ఒక్కటిగా బతకడమే..తెలుసువాటికీ
తమ చిన్నారి ఆగూడే..కోవెలగా తలచాయి     
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు...గువ్వలూ
చేరాయి రెండు...గువ్వలూ

చరణం::3

పూలమాలలో దారం..దాగివుంటదీ  
వలపుజంటలో చెలిమి...దాగనంటదీ
కలిసి మెలిసి కధలెన్నో..అల్లుకున్నవీ   
అంతులేని ఆశలెన్నో..పెంచుకున్నవీ
తన చెలికాడే దేవుడని..మనసార తలచిందీ      
ఒకే తోటలోన..ఒక గూటిలోన  
చేరాయి రెండు...గువ్వలూ  
చేరాయి రెండు...గువ్వలూ

No comments: