Monday, December 08, 2008

దేవుడు చేసిన పెళ్ళి--1975


















సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::శరావతి
తారాగణం::శోభన్‌బాబు,శారద,లక్ష్మి,నాగభూషణం,చంద్రమోహన్,గిరిబాబు,రావుగోపాలరావు

పల్లవి::

అమ్మ పాడలేదు..నేను చూడలేను
నా గొంతుతో..అమ్మ పాట పాడనా 
అమ్మ కళ్ళతో..నిన్ను నేను చూడనా
అమ్మ పాడ..లేదు నేను చూడలేను

చరణం::1

నీ కళ్ళలో మెరిసే..కన్నీళ్ళనే
అమ్మ...చూడలేదురా 
నీ కళ్ళలో మెరిసే..కన్నీళ్ళనే
అమ్మ...చూడలేదురా 
బోసినవ్వుల..ఒలక బోసి
ఇంటినిండా..వెలుగు నింపీ
ఆడాలిరా..నాతో..పాడాలిరా
అమ్మ పాడ లేదు..నేను చూడలేను

చరణం::2

ప్రతి అమ్మనోట పలికే..ప్రతిమాట ఒక జోల పాటరా
ప్రతి అమ్మనోట పలికే..ప్రతిమాట ఒక జోల పాటరా
మీ అమ్మ లోని..మూగభావన అన్నివేళల నీకు
దీవెన కావాలిరా..బాబూ కావాలిరా
అమ్మ పాడ లేదు..నేను చూడలేను

చరణం::3

అమ్మా అని నీవు..నోరారగా అమ్మను పిలవాలిరా
అమ్మా అని నీవు..నోరారగా అమ్మను పిలవాలిరా
అమ్మ మనసే పొంగిపోయి..యెత్తుకొని నిను ముద్దులాడీ
మురిసేనురా..మేను మరచేనురా    
అమ్మ పాడలేదు...నేను చూడలేను
నా గొంతుతో...అమ్మ పాట పాడనా 
అమ్మ కళ్ళతో...నిన్ను నేను చూడనా
అమ్మ పాడ...లేదు నేను చూడలేను

No comments: