Wednesday, November 10, 2010

సత్యానికి సంకెళ్ళు--1974



















సంగీత::చక్రవర్తి
రచన::శ్రీశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ
ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊఊ
నా ఆశలన్నీ నిజం చేసావూ
నీకూ నీవారు లేరూ..ఊఊఊఊ

చరణం::1

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
దారిలోని గడ్డిపువ్వు..నలిగిపోయే వేళ నువ్వు 
మల్లెపువ్వుగ మార్చివేసావూ..ఊఊఊఊ
నీ మనసులోనే దాచివేసావూ
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ

చరణం::2

రిక్షాకే రెక్కలొచ్చి..నక్షత్ర యాత్ర చేస్తే
రిక్షాకే రెక్కలొచ్చి..క్షత్ర యాత్ర చేస్తే
పక్షులే మన పాట..వింటాయీ..ఈఈఈ 
మబ్బులే పరదాలు..కడతాయీ 
ఈ మబ్బులే పరదాలు..కడతాయీ
నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ

హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
కప్పులేని ఇంటిలోనా..గడపలేని పడక గదిలో
కప్పులేని ఇంటిలోనా గడపలేని..పడక గదిలో
చందమామా తొంగి చూస్తాడూ..అందమంతా ఒలకబోస్తాడూ
తన అందమంతా ఒలకబోస్తాడూ..నీకూ నీవారు లేరూ
నాకూ నా వారు లేరూ
ఆసరాగా నాకు దొరికావూ..ఊఊఊ
నా ఆశలన్నీ నిజం చేసావూ..
నా ఆశలన్నీ నిజం చేసావూ..

No comments: