Tuesday, November 10, 2009

శ్రీవారు మావారు--1973

సంగీత::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,S. వరలక్ష్మి,గీతాంజలి 

పల్లవి::

చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికి రావా  
చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికి రావా  

చరణం::1

రామ చిలక జామ పండు కొరికినప్పుడు..ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
రామ చిలక జామ పండు కొరికినప్పుడు..ఏమి రుచులు నాలోన కలిగెనప్పుడు
చందమామ మొగలు మీద పొడిచినప్పుడు..వయసు ఎన్నిరేకులో విప్పెనప్పుడు
ఏమని చెప్పను ఎలా మనసు విప్పను..నీకు బదులుగా నేనే చెప్పవలసి వచ్చెను
బావా..దారికిరావా   
చేయివేస్తే చాలుచిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికిరావా  

చరణం::2

గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది..నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
గువ్వలాగ కన్నెమనసు ఎగురుతున్నది..నీ గుండెలోని గూటి కొరకు తిరుగుతున్నది
లేతవలపు జింక లాగ దుముకు తున్నది..నీ కౌగిలిలో నిలుపుకుంటె వొదిగి వుంటది
మేనత్త కూతురిని ! నీ ముద్దు మరదల్ని..మేనత్త కూతురిని నీ ముద్దు మరదల్ని
జతగా నువులేకుంటే బ్రతుకంతా ఒంటరిని బావా..దారికిరావా
చేయివేస్తే చాలు చిర్రుమంటాడప్పా..చూపుతోనే నన్నూ జుర్రు కుంటా డప్పా
ఏం ముంచు కొచ్చిందని యింతటి రుసరుసలు..బావా..దారికిరావా

No comments: