Thursday, November 13, 2008

శాంతి నిలయం--1972
















సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

ఇంతమాత్ర మెరుగువా కన్నయ్యా
ఏమంత పసివాడవా కన్నయ్యా
ఏమంత పసివాడవా కన్నయ్యా
ఏమంత పసివాడవా..ఆఆ 

చరణం::1

ఏభామ యింటిలో..ఎంత పాడివున్నదో
ఏ వుట్టిపై ఎంత వెన్నదాచి..వున్నదో 
తెలిసి దోచు కన్నయ్య..ఎంత తియ్యనీ..ఈ
దొంగవయా కన్నయ్యా..ఆ ఆ ఆ
కన్నయ్యా..ఆఆఆఆఆఆఆఆఆ     
ఏభామ యింటిలో..ఎంత పాడివున్నదో
ఏ వుట్టిపై ఎంత వెన్నదాచి..వున్నదో 
తెలిసి దోచు కన్నయ్య..ఎంత తియ్యనీ..ఈ..దొంగవయా 
తెలియదా తొలిరేయి..కన్నెమనసు కోర్కెలు
చిలిపిగ పులకించు దోరవయసు..చేష్టలు  
ఇంతమాత్ర మెరుగువా కన్నయ్యా..ఆఆ 
ఏమంత పసివాడవా..కన్నయ్యా..ఏమంత పసివాడవా..ఆ

చరణం::2

ఏ లేత వెదురులో..ఏ పలుకు పలుకునో
ఏ రాగమాలపించ..ఏలేగ ఆడునో
ఎరిగిన దానలోన..నన్నెరుగవా..ఆ..గోపాలా 
నీమోవి తాకితే..ఆ మురళి రవళించు
ఆ మురళి రవళిలో..యీ రాధ జీవించు    
ఆ మురళి రవళిలో..ఓ..యీ రాధ జీవించు

No comments: