Wednesday, November 21, 2007

నా తమ్ముడు--1971




















సంగీత::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::జగ్గయ్య, శోభన్‌బాబు, భారతి, నాగభూషణం, అల్లు రామలింగయ్య

పల్లవి::

అలవాటు లేదని..మడి గట్టుకోకు
అలవాటు లేదని..మడి గట్టుకోకు 
అందాన్ని కాదని..చెడగొట్టుకోకు

చరణం::1

సొగసంత ఎగబోసు కొచ్చాను..నేను
వయసంత నిలవేసుకున్నావు..నీవు
సొగసంత ఎగబోసు కొచ్చాను..నేను
వయసంత నిలవేసుకున్నావు..నీవు
గుటకలు వేస్తూంది..నీ పిరికి మనసు
గుటకలు వేస్తూంది..నీ పిరికి మనసు
నీ గుట్టంత ఈ గడుసు పిల్లకే..తెలుసు 
అలవాటు లేదని..అలవాటు లేదని 
మడి గట్టుకోకు..అందాన్ని కాదని చెడగొట్టుకోకు 

చరణం::2

చిగురాకు పెదవుల్లో..చిమ్మింది ఎరుపు
వగలాడి కళ్ళల్లో..మెరిసింది మెరుపు
హ్హా..చిగురాకు పెదవుల్లో..చిమ్మింది ఎరుపు
వగలాడి కళ్ళల్లో..మెరిసింది మెరుపు
పదునైన పరువాన..పండించు వలపు..హ్హా
పదునైన పరువాన..పండించు వలపు
వదులుకున్నావంటె..వయసుకే చెరుపు..హాహాహా  
అలవాటు లేదని..మడి గట్టుకోకు 
అందాన్ని కాదని..చెడగొట్టుకోకు

చరణం::3

అనుభవం లేదంటె..నీ తప్పుకాదు
ఆశలే లేవంటే...నే నొప్పుకోను
అనుభవం లేదంటె..నీ తప్పుకాదు
ఆశలే లేవంటే...నే నొప్పుకోను
అలవాటు లేదని..అలవాటు లేదని 
మడి గట్టుకోకు..అందాన్ని కాదని చెడగొట్టుకోకు

No comments: