Monday, October 18, 2010

భక్త తుకారాం--1973


























సంగీత::P.ఆదినారాయణరావు
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::A.N.R.శివాజీ గణేషన్,అంజలిదేవి,కాంచన,నాగభూషణం,ధూళిపాళ,సాక్షి రంగారావు.
బేబి శ్రీదేవి

పల్లవి::

కలియుగం కలియుగం కలియుగం కలియుగం 
కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

కూడుగుడ్డలేని వాళ్ళు అవుతారా భక్తులు..అవుతారా భక్తులు 
కోవెలలో దేవుడెలా వుంటాడు పస్తులు..వుంటాడు పస్తులు
ఉన్నవారు యివ్వాలి కానుకలు..యివ్వాలి కానుకలు
ఊరికి ఉపకారం చెయ్యలి ఉత్తములు..మాలాంటి ఉత్తములు 
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

కాంతా కనకాలెకదా పాపాలకు మూలము..పాపాలకు మూలము
ఆ రెండూ మాకు వదలి చేసుకోండి పుణ్యము..చేసుకోండి పుణ్యము
శివుడు మింగే హలాహలం జగతికోసము 
మీరిచ్చేదంత మింగుతాము మీకోసము
క్రిందనున్న వారినెల్ల పైకితెచ్చి..కిటుకుచెప్పి 
చూపుతాము స్వర్గము..చూపుతాము స్వర్గము
కలియుగం కలియుగం..కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు..అడుగడుగున సంకటం 
హరేరామ హరేరామ..రామరామ హరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ..కృష్ణకృష్ణ హరేహరే
హరేరామ హరేరామ..రామరామ హరేహరే

No comments: