Wednesday, October 27, 2010

వింత సంసారం--1971




సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::సావిత్రి,రమాప్రభ,జగ్గయ్య,రామ్మోహన్,రాజబాబు,చిత్తూర్V.నాగయ్య,లీలారాణి.

పల్లవి::

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంట నీరు..నే చూడలేను
హృదయాన జ్వాల..రగిలేనులే 

చరణం::1

కష్టాలనన్నీ సౌఖ్యాలు..చేసి
కన్నీటినంతా పన్నీరు..చేసే
కులకాంత వొడిలో..తలవాల్చగానే 
స్వర్గాలు భువి పై..వాలేనులే 

అడ్డాలలోన..బిడ్డలేగాని
పెరిగేరు వారు..మరిచేరు మనను
వయసైనవారు..కోరేటి మమత
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు
కరువాయె మనకు..బరువాయె బ్రతుకు

చరణం::2

చల్లంగ చూచే..ఇల్లాలితో
ఈ లోకాన ఎవరూ..సరిరారులే 
నాలోన సగమై..నా ప్రేమ జగమై
నా తోడు నీడై..నిలిచేవులే..ఏ..

నా కంటి పాప..నా యింటి దీపం
ఆనాడు ఈనాడు..యేనాడు నీవే
నీ కంటనీరు..నే చూడలేను..ఊఊ 

No comments: