Saturday, September 04, 2010

అడవి సింహాలు--1983



























సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::K.Ragavendra Rao
తారాగణం::కృష్ణ,కృష్ణంరాజు,జయప్రద,శ్రీదేవి,గిరిబాబు,కైకాల.సత్యనారాయణ,
రావు గోపాలరావు ,అల్లు రామలింగయ్య,సిల్క్‌స్మిత. 

పల్లవి::

ఏహే హే  ఏహే  హే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా..ప్రియతమా
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా  
సౌఖ్యమా..నా ప్రాణమా

చరణం::1 

నీలి కురుల వాలు జడల చాటు 
నడుము కదలిక..కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి 
వలపు కానుక..పదిలమా
నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 
చెలరేగే మోహాలు..క్షేమమా
నీలి కురుల వాలు జడల 
చాటు నడుము కదలిక..కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి 
వలపు కానుక..పదిలమా

నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 
చెలరేగే మోహాలు..క్షేమమా

చలి గాలి గిలిగింత సౌఖ్యమా
చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే..నా లాభము 
నీ లాభమే..నా మోక్షము

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా 
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

చరణం::2

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి..కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు..పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి..కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు..పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా

తహతహలు తాపాలు..సౌఖ్యమా
బిడియాలు బింకాలు..సౌఖ్యమా
నీ సౌఖ్యమే..నా సర్వమూ 
ఆ సర్వమూ..నా సొంతమూ

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

No comments: