Sunday, September 19, 2010

పుట్టినిల్లు మెట్టినిల్లు--1973


























సంగీతం::సత్యం 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరి
తారాగణం::కృష్ణ,శోభన్‌బాబు,సావిత్రి,లక్ష్మి,చంద్రకళ,రమాప్రభ,రాజబాబు,నాగయ్య  

పల్లవి::

ఓహో..ఓహో..అహా,,అహా..ఏహేయ్ 

ఆహా బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఆహా..బోల్తా పడ్డావు బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఏమి సిగ్గా..కందె బుగ్గా..
తుళ్ళి..పడకోయ్ మల్లెమొగ్గా
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా

చరణం::1

యేటుగాడి వనుకున్నా..వోరబ్బా 
కన్నెజింక చేత తిన్నావు..దెబ్బ 
కోప మొద్దూ..ఊ..తాప.మొద్దూ 
ఉన్న మాటే..ఏ..ఉలక వద్దూ 
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా  
ఓహో..బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా

చరణం::2

సరదాగా అన్నాను..చిన్నోడా 
కలకాలం కావాలి..నీ నీడ 
హో..సరదాగా అన్నాను చిన్నోడా 
కలకాలం కావాలి..నీ నీడ 
కలుపు చేయీ..కలుగు హాయీ 
పోరు నష్టం..పొందు లాభం
బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా 
ఓహో..బోల్తా పడ్డావు..బుజ్జి నాయనా 
చెమ్కి తిన్నావు..చిన్ని నాయనా
ఏమి సిగ్గా..ఆ..కందె బుగ్గా..ఆ
తుళ్ళి పడకోయ్..ఈ..మల్లెమొగ్గా

No comments: