Monday, August 15, 2011

దేశంలో దొంగలు పడ్డారు--1985:::కదన కుతూహల::రాగం














సంగీతం::చక్రవర్తి
రచన::అదృష్టదీపక్ 
గానం::S.P.బాలు, P.సుశీల 
తారాగణం::P.L. నారాయణ , సుమన్, విజయ శాంతి
కదన కుతూహల::రాగం

ఉదయించని ఉదయం కోసం
ఎద ఎదలో రగిలెను హోమం
ఉదయించని ఉదయం కోసం
ఎద ఎదలో రగిలెను హోమం
అణగారిన ఆర్తుల కంఠం నినదించెను శంఖారావం
వందే మాతరం..వందే మాతరం
ఇది కదన కుతూహల రాగం తుది కదనానికి నాందీ గీతం 
వందే.మాతరం..వందే మాతరం

:::1

ధీరులెందరో నేలకొరిగినా..విరామమెరుగని గానం
చెలరేగిన జనసందోహానికి..అలజడి ఒకటే ప్రాణం
వందే మాతరం..వందే మాతరం.. 
ఇది కదన కుతూహల రాగం తుది కదనానికి నాందీ గీతం 

:::2

రామరాజు చిందించిన రక్తం..యువతకు తిలకం దిద్దాలి 
వందే మాతరం..వందే మాతరం
భగత్ సింగ్ వీరావేశం..మీలో కలిగించాలి ఆవేశం
వందే మాతరం..వందే మాతరం

No comments: