Tuesday, August 23, 2011

ముక్కు పుడక--1983




సంగీతం::J.V.రాఘవులు
రచన::సి.నా.రే 
గానం::P.సుశీల  

పల్లవి::

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరి వుంటే బతుకంతా ఏడడుగుల నడకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరి వుంటే బతుకంతా ఏడడుగుల నడకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా

చరణం::1

చల్లని నా రాజు కళ్ళలో వున్నాడు
కన్నీళ్ళు రాకుండా కాపలా వున్నాడు
చల్లని నా రాజు కళ్ళలో వున్నాడు
కన్నీళ్ళు రాకుండా కాపలా వున్నాడు
కలికి మనసులో..ఎన్ని ఆశలో
కలికి మనసులో..ఎన్ని ఆశలో
అది కాచుకుంది ప్రతి నిముషం రెప్ప వాల్చకా

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరి వుంటే బతుకంతా ఏడడుగుల నడకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా

చరణం::2

మూడు ముళ్ళ సాక్ష్యం నీవాడు మరచి పోలేడూ
తన నీడ చూసుకుని తానె ఉలికి పడతాడు
మూడు ముళ్ళ సాక్ష్యం నీవాడు మరచి పోలేడూ
తన నీడ చూసుకుని తానె ఉలికి పడతాడు
దాగదు పాపం..ఆగదు పుణ్యం
దాగదు పాపం..ఆగదు పుణ్యం
ఈ బ్రతుకిలాగే వుండదు నీ నోము పండకా

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరితోనే నడిచేవు చివరి ఘడియ దాకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా
ఆ నడకా ఏడేడు జన్మల దాకా
ఆ నడకా ఏడేడు జన్మల దాకా

No comments: