Wednesday, July 30, 2014

వంశవృక్షం--1980::చక్రవాకం::రాగం




సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::సినారె 
గానం::S.P. బాలు , S.P.శైలజ 
తారాగణం::K.V. సోమయాజులు,అనీల్ కుమార్,జ్యోతి,కాంతారావు,ముక్కామల..
చక్రవాకం::రాగం 

పల్లవి::

వంశీకృష్ణా..ఆఆ..యదు వంశీకృష్ణా 
వంశీకృష్ణా..యదు వంశీకృష్ణా..ఆ 
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా..కృష్ణా కృష్ణా 
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా..కృష్ణా కృష్ణా 
వంశీకృష్ణా..యదు వంశీకృష్ణా

చరణం::1

పుట్టింది రాజకుమారుడుగా 
పెరిగింది గోపకిశోరుడుగా..ఆ 
తిరిగింది యమునా తీరమున 
నిలిచింది గీతాసారంలో 
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా..కృష్ణా కృష్ణా 
వంశీకృష్ణా..యదు వంశీకృష్ణా 

చరణం::2

ప్రాణులందరూ వేణువులే 
అవి పలికేది నీ రాగములే 
పాడేది పాడించేది ఆడేది ఆడించేది 
ఓడేది ఓడించేది 
అంతా నువ్వేలే అన్నీ నీలీలలే  
గోప వనితా హృదయ సరసి 
రాజ హంసా..కృష్ణా కృష్ణా 
వంశీకృష్ణా..యదు వంశీకృష్ణా 

నోటిలో ధరణి చూపిన కృష్ణా..ఆ 
గోటితో గిరిని మోసిన కృష్ణా ..ఆ
ఆటగా రణము నడిపిన కృష్ణా
ఆటగా రణము నడిపిన కృష్ణా
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా 
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా 
కిల కిల మువ్వల కేళీ కృష్ణా 
తకధిమి తకధిమి తాండవ కృష్ణా  
కేళీ కృష్ణా..తాండవ కృష్ణా 
కేళీ కృష్ణా..తాండవ కృష్ణా 
కేళీ కృష్ణా..తాండవ కృష్ణా 


No comments: